నేడు కాకినాడలో జాబ్ మేళా

నేడు కాకినాడలో జాబ్ మేళా

కాకినాడ జిల్లా కలెక్టరేట్‌లోని వికాస కార్యాలయంలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రాజెక్టు డైరెక్టర్ లచ్చారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో రెండు ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని, డిగ్రీ ఉత్తీర్ణులై, 30 ఏళ్ల లోపు వయసు కలిగిన అభ్యర్థులను అర్హులుగా ప్రకటించారు. ఆసక్తి గల వారు తమ ధ్రువీకరణ పత్రాలతో ఉదయం 9 గంటలకు వికాస కార్యాలయానికి హాజరు కావాలని సూచించారు.