ఫిరంగిపురంలో పింఛన్లు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ
GNTR: ఫిరంగిపురం మండలంలో సోమవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అందించారు. మండలంలోని అన్ని గ్రామాల తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, సచివాలయం సిబ్బంది ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.