మత్స్యకారుల దినోత్సవంలో ఎంపీ ఫ్లెక్సీ కలకలం
NGKL: కొల్లాపూర్‌లో ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా బహిరంగ సభను శుక్రవారం నిర్వహించారు. '2028లో తెలంగాణకు కాబోయే సీఎం ఈటల రాజేందర్ అని' 'కొల్లాపూర్‌కు కాబోయే బీసీ ఎమ్మెల్యే' అంటూ ప్రదర్శించిన ఫ్లెక్సీ సంచలనంగా మారింది. వేదికపై ఉన్న కాంగ్రెస్ మంత్రులు, నాయకులు అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.