VIDEO: కార్తీక పౌర్ణమి వేడుకలు
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇవాళ శివాజీ నగర్ ఏరియాలోని ప్రతాపవాడ శివాలయంలో ఉదయం నుంచి ఆలయ పూజారులు శివునికి అభిషేకం అర్చనలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని క్యూ లైన్‌లో భక్తి శ్రద్ధలతో స్వామిని దర్శించుకొన్నారు. ఆలయంలోని ఉసిరి, తులసి చెట్ల వద్ద దీపాలు వెలిగించి హారతి సమర్పించారు.