డ్రైనేజ్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

BDK: చండ్రుగొండ మండలం బెండలపాడు గ్రామంలో ఈరోజు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటించారు. అనంతరం డ్రైనేజ్ మరమ్మతు పనులను పరిశీలించారు. వరద నీరు ఎక్కడ నిలువ లేకుండా డ్రైనేజ్ నిర్మాణ పనులు సక్రమంగా నిర్మించాలని అధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలందరూ ఇంటి పరిసర ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు.