అలుగు పారుతున్న మంగాపురం పెద్ద చెరువు

అలుగు పారుతున్న మంగాపురం పెద్ద చెరువు

SRD: హత్నూర మండలం మంగాపూర్ గ్రామ శివారులోని పెద్ద చెరువు అలుగు పారుతోంది. గత నాలుగు రోజుల నుంచి విస్తారంగా కురుస్తున్న వర్షాలకు చెరువు పూర్తిస్థాయిలో నిండి జలకళను సంతరించుకుంది. అదేవిధంగా మండలంలోని ఆయా గ్రామాల్లో చెరువులు, కుంటలు కూడా నిండాయి.