VIDEO: బంగీ జంపింగ్ చేస్తుండగా ప్రమాదం
రిషికేశ్‌లో బంగీ జంప్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. సోను కుమార్ అనే వ్యక్తి స్నేహితులతో కలిసి రిషికేశ్‌కు వెళ్లాడు. అక్కడి బంగీ జంప్ చేస్తుండగా అతడికి కట్టిన తాడు తెగిపోయింది. దీంతో అతను కింద ఉన్న ఓ రేకుల షెడ్‌పై పడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్నేహితులు అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.