వేంకటగిరిలో ఘనంగా వసంతోత్సవం

వేంకటగిరిలో ఘనంగా వసంతోత్సవం

TPT: వెంకటగిరి పట్టణ పరిధిలోని బంగారుపేటలో ఉన్న శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం వసంతోత్సవం, చందనాలంకారం కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. సీతారామ లక్ష్మణ, ఆంజనేయ స్వామివార్లను చందనంతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు.