అధ్వాన రహదారిపై రాకపోకలకు ఇబ్బందులు

అధ్వాన రహదారిపై రాకపోకలకు ఇబ్బందులు

ASR: అనంతగిరిలోని జాలడ నుంచి పెదకోట వరకు తారు రోడ్డు నిర్మాణం చేపట్టాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. కొన్ని సంవత్సరాల కిందట నిర్మించిన తారురోడ్డు పూర్తిగా ధ్వంసమై అధ్వానంగా తయారవడంతో వాహనచోదకులు రాకపోకల సమయంలో ప్రమాదాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణం చేపట్టాలని వేడుకుంటున్నారు.