రేపు టెన్నికాయిట్ జిల్లా జట్టు ఎంపికలు

రేపు టెన్నికాయిట్ జిల్లా జట్టు ఎంపికలు

SKLM: రాష్ట్ర స్థాయి U-14 బాలబాలికల టెన్ని కాయిట్ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక పోటీలు రేపు పలాస ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు టెన్నికాయిట్ రాష్ట్ర ప్రతినిధి తవిటయ్య గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 2011 జనవరి ఒకటో తేదీ తర్వాత పుట్టిన వారు అర్హులని ,ఆసక్తి ఉన్న వారు వయసు ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, నాలుగు ఫొటోలతో హాజరు కావాలన్నారు.