నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం గుండి రోడ్డులో 2 విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లను తరలించే పనుల్లో భాగంగా ఇవాళ విద్యుత్ అంతరాయం ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 వరకు గుండి పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ ఏఈ లక్ష్మిరాజం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యుత్ సరఫరాలో ఏర్పడనున్న అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని కోరారు.