మల్దకల్‌లో ప్రీ ప్రైమరీ సెక్షన్లు ప్రారంభం

GDWL: రాష్ట్ర, జిల్లా అధికారుల ఆదేశాల మేరకు మల్దకల్ మండలంలోని ఉలిగెపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ సెక్షన్లు (పూర్వ ప్రాథమిక తరగతులు) ప్రారంభమయ్యాయి. మల్దకల్ మండలంలో ఉలిగెపల్లి, నాగర్‌దొడ్డి పాఠశాలల్లో ఈ సెక్షన్లు ప్రారంభించేందుకు అనుమతులు లభించాయి. త్వరలోనే ఒక ఉపాధ్యాయురాలిని, ఒక ఆయాను నియమిస్తామని మండల విద్యాధికారి సురేష్ తెలిపారు.