అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ స్వాధీనం

అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ స్వాధీనం

AKP: రాంబిల్లి మండలం వాడరాంబిల్లి నుంచి అక్రమంగా సముద్రం ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకున్నట్లు సీఐ నర్సింగరావు ఆదివారం తెలిపారు. ముందుగా అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించి ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకుని స్థానిక తహసీల్దార్‌కు అప్పగించినట్లు తెలిపారు. ఎవరైనా అనుమతులు లేకుండా అక్రమంగా సముద్రం ఇసుకను తరలిస్తే చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.