వినికిడిపై పుట్టపర్తిలో అవగాహన ర్యాలీ

వినికిడిపై పుట్టపర్తిలో అవగాహన ర్యాలీ

సత్యసాయి: ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పుట్టపర్తిలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.ఫైరోజా బేగం ర్యాలీని ప్రారంభించారు. అధిక శబ్దం, సెల్‌ఫోన్ల అతి వినియోగం వల్ల వినికిడి సమస్యలు పెరుగుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. వినికిడి లోపాలను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స తీసుకోవాలని సూచించారు.