సింగిల్ డిజిట్‌కు పడిపోయిన ఉష్ణోగ్రతలు
అల్లూరి జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం ఉష్ణోగ్రతలు మరింత దిగజారాయి. జీ.మాడుగుల మండలంలో 7.51 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ అప్పలస్వామి శుక్రవారం తెలిపారు. అరకులో 7.69, డుంబ్రిగుడలో 7.88, ముంచంగిపుట్టులో 8.5, హుకుంపేటలో 9.19 డిగ్రీలు నమోదయ్యాయని ఆయన వెల్లడించారు.