పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు
VZM: పోలీసులకు వచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు ఎ.వి. ఎన్.కాలేజీ వెనుక చెరువుగట్టు వద్ద పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొన్నారు. వారి వద్ద నుంచి రూ.10,880 నగదును స్వాధీనం చేసుకున్నామని ఎస్.కోట పట్టణ సీఐ వి.నారాయణమూర్తి మంగళవారం తెలిపారు. ఆనంతరం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు.