'రక్తదానానికి యువత ముందుకు రావాలి'

'రక్తదానానికి యువత ముందుకు రావాలి'

VZM: రక్తదానానికి యువత ముందుకు రావాలని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు పురస్కరించుకొని సోమవారం బొండపల్లి మండలంలోని నిలివాడలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి శ్రీనివాస్ ప్రారంభించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలన్నారు.