రోడ్డు ప్రమాదాల నివారణకు వాహన తనిఖీలు
కృష్ణా: జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించడం, అక్రమ రవాణాను అడ్డుకోవడం అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించడమే లక్ష్యంగా పోలీసులు నిన్న వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వాహనాలను ఆపి డ్రైవింగ్ లైసెన్స్, ఆర్.సీ పొల్యూషన్ ఇన్షూరెన్స్ వంటి కీలక పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు.హెల్మెట్ ధరించని వాహనదారులపై చలాన్లు విధించారు.