యూనస్‌పై విరుచుకుపడిన హసీనా

యూనస్‌పై విరుచుకుపడిన హసీనా

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్‌పై ఆ దేశ మాజీ ప్రధాని హసీనా విరుచుకుపడ్డారు. యూనస్ తీవ్రవాద గ్రూపుల మద్దతుతో పరిపాలన చేస్తున్నారని మండిపడ్డారు. బంగ్లాదేశ్‌ను అమెరికాకు అమ్మేస్తున్నారని వ్యాఖ్యానించారు. అలాగే తన పార్టీ అవామీ లీగ్‌పై నిషేధం విధించటం రాజ్యాంగ విరుద్ధమన్నారు. తన పార్టీని నిషేధించే హక్కు యూనస్‌కు లేదని వెల్లడించారు.