'పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలి'
NLG: మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కట్టంగూరు ఎంపీడీవో పెరుమళ్ళ జ్ఞాన ప్రకాశరావు కోరారు. ఎన్నికల విధుల్లో ఉండే ప్రతి ఒక్కరూ ఈనెల తొమ్మిది వరకు స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును ఉపయోగించుకునే సౌకర్యం కల్పించామని తెలిపారు.