VIDEO: అగ్నిప్రమాద చిన్నారులకు ఆర్థిక సాయం
VSP: అగ్నిప్రమాదంలో గాయపడిన ఇద్దరు చిన్నారులకు మాజీ ఎమ్మెల్యే, దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ రూ.10,000 ఆర్థిక సాయం బుధవారం అందజేశారు. 30వ వార్డు రెల్లి వీధిలో జరిగిన ప్రమాదంలో గాయపడిన నక్షత్రలహరి, ధనుష్‌లను పరామర్శించి, కుటుంబానికి భరోసా కల్పించారు. పిల్లలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.