యుద్ధం వేళ ఇరాన్ సంచలన వ్యాఖ్యలు

యుద్ధం వేళ ఇరాన్ సంచలన వ్యాఖ్యలు

పశ్చిమాసియాలో యుద్ధం వేళ భారత్‌లోని ఇరాన్ ప్రతినిధి డా.అబ్దుల్ మజీద్ హకీమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధంలో తాము ఎంతవరకైనా వెళ్తామని, అవసరమైతే ఇంకా ఐదు ఏళ్లు అయినా దాడులు కొనసాగిస్తామంటూ వ్యాఖ్యానించారు. ఆయన మాటలను బట్టి ఇరాన్.. అమెరికా, ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకునే విషయంలో వెనక్కి తగ్గేలా కనిపించట్లేదు. కాగా, ఇరాన్‌పై US దాడులు కొనసాగిస్తోంది.