ఎస్ కోట మండలంలో కురుస్తున్న పొగ మంచు

VZM: ఎస్. కోట మండలంలో ఇవాళ ఉదయం పొగ మంచు తీవ్రంగా కురిసింది. ప్రధానంగా ఎస్జీపేట, తలారి, వినాయక పల్లిలో ఉదయం 7 గంటలైనా మంచు తెరలు తొలగలేదు. దీంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతో వాహనాలకు లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. మంచు కారణంగా వరి పంటకు తెగుళ్లు సోకే ప్రమాదం ఉందని రైతులు అంటున్నారు.