VIDEO: కొండగట్టులో కూలిన పందిరి.. పలువురికి గాయాలు
JGL: కొండగట్టు అంజన్న చిన్న జయంతి ఉత్సవాల కారణంగా, భక్తుల రద్దీ దృష్ట్యా కోనేరు వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక తలనీలాల పందిరి బుధవారం తెల్లవారుజామున కూలిపోయింది. ఈ ఘటనలో పలువురు నాయిబ్రాహ్మణులకు గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. ఉత్సవాల మొదటి రోజే ప్రమాదం జరగడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు.