జిల్లాలో గ్యాస్ కొరత లేదు: జేసీ
ఏలూరు: జడ్పీ సర్వసభ్య సమావేశంలో జేసీ అభిషేక్ గౌడ్ పాల్గొని జిల్లాలో వంటగ్యాస్ సరఫరాపై కీలక ప్రకటన చేశారు. గృహ వినియోగదారులకు గ్యాస్ కొరత లేదని, పైప్ లైన్ ద్వారా సరఫరాను మరింత విస్తరిస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న 5 వేల కనెక్షన్లను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రభుత్వ పాఠశాలలకు అంతరాయం లేకుండా గ్యాస్ అందిస్తామన్నారు.