కాంగ్రెస్ శ్రేణులకు టీపీసీసీ కీలక పిలుపు
TG: జాతీయ ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరును తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రను గ్రామీణ ప్రజలకు తెలియజేయాలని TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ఉపాధి హామీ పథకం అమలు బాధ్యతల నుంచి కేంద్రం పక్కకు జరగాలని కుట్ర చేస్తుందని అన్నారు. కేంద్రం నిర్ణయానికి నిరసనగా రేపు జిల్లా కేంద్రాలలో డీసీసీ అధ్యక్షుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.