గంజాయి సాగు చేస్తున్న వ్యక్తి అరెస్ట్
SRCL: గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. వేములవాడలోని పోలీస్ స్టేషన్‌లో శనివారం ఆయన మాట్లాడారు. వేములవాడ మండలం అగ్రహారం గ్రామ శివారులో ఉత్తర ప్రదేశ్‌కు చెందిన అచ్చేలాల్ గంజాయి మొక్కలను పెంచుతున్నాడని తెలిపారు. నమ్మదగిన సమాచారంతో దాడి చేసి నిందితున్ని అదుపులోకి తీసుకున్నామన్నారు.