బెంగళూరులో రూ.7 కోట్ల చోరీని ఛేదించిన పోలీసులు
బెంగళూరులో రూ.7కోట్ల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. సీబీఐ అధికారులమంటూ ఇటీవల ఏటీఎంలలో నగదు నింపే వాహనం నుంచి రూ.7.11 కోట్లను దుండగులు కాజేశారు. ఈ కేసును ఛేదించిన పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.5.76 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.