స్థానిక సంస్థల ఎన్నికలకు భారీ బందోబస్తు ఏర్పాటు: ఎస్పీ
VKB: సర్పంచ్ ఎన్నికల సందర్భంగా సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను గుర్తించి బందోబస్తు ఏర్పాటు చేయాలని SP స్నేహ మెహ్రా పోలీసు సిబ్బందిని ఆదేశించారు. జిల్లాలో మూడు విడతలుగా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మొదటి విడతలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆమె పేర్కొన్నారు. అనుమానస్పద వ్యక్తులపై నిఘా ఉంచాలని సూచించారు.