ఈ నెల 12న జై మహంకాళీ జాతర

ADB: సిరికొండ మండలం వాయిపేట్ గ్రామంలో ఈ నెల 12 తేదీ నుంచి 15 వరకు జై మహంకాళి దేవాలయం బ్రహ్మోత్సవం జాతర జరగనున్నట్లుగా కినక శంభు స్వామి తెలిపారు. శనివారం మహంకాళి దేవాలయంలో జాతరకు సంబంధించిన కరపత్రాలను గ్రామ పెద్దలతో కలిసి ఆయన విడుదల చేశారు. జాతరతోపాటు ఆటలు పోటీలు ఉంటాయన్నారు. విజేతలకు బహుమతులు అందజేస్తామని వెల్లడించారు.