పుష్ప తరహాలో గంజాయి తరలింపు

పుష్ప తరహాలో గంజాయి తరలింపు

SRD: ఓ వ్యక్తి గంజాయి తరలిస్తుండగా ఎక్సైజ్ పోలీసులు సంగారెడ్డి శివారులో శుక్రవారం పట్టుకున్నారు. కార్ డాష్ బోర్డు, సీట్ల కింద ప్రత్యేకంగా గంజాయిని పెట్టుకొని వెళుతుండగా పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చిరంజీవి ఒడిశా నుంచి మహారాష్ట్రకు కారులో తరలిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. అతని వద్ద నుంచి ఐదు కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు.