బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం

NLG: మిర్యాలగూడ మున్సిపాలిటీ ఆఫీస్ ముందు బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఇటీవల నూతనంగా ఎన్నికైన కమిటీ ఫ్లెక్సీలు మున్సిపాలిటీ సిబ్బంది తొలగించడాన్ని నిరసిస్తూ ఈ ధర్నా కార్యక్రమం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు పురుషోత్తం, సైదులు, లక్ష్మారెడ్డి రాకేష్ రెడ్డి వెంకటరమణ పాల్గొన్నారు.