VIDEO: కలెక్టర్ కార్యాలయం ఎదుట TRSV ధర్నా
ములుగు జిల్లా కేంద్రంలో TRSV ఆధ్వర్యంలో "హలో విద్యార్థి -చలో కలెక్టరేట్" కార్యక్రమం సందర్భంగా బుధవారం విద్యార్థులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో గాడి తప్పిన విద్యాశాఖను సరిచేయడానికి వెంటనే కొత్త విద్యాశాఖ మంత్రిని నియమించాలని వారు డిమాండ్ చేశారు. ప్రస్తుత విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం పూర్తిగా విఫలం చెందారన్నారు.