ఎస్సీ కాలనీలో డ్రైనేజీ పనులు పూర్తి
E.G: గోకవరం మండలం ఇట్టికాయలపల్లి గ్రామం ఎస్సీ కాలనీలో రూ. 10 లక్షలతో డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందని ఇటకాలపల్లి ఎంపీటీసీ గళ్ల కృష్ణ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్ల నుంచి ఎస్సీ పేటలో డ్రైనేజీ లేక అవస్థ పడుతున్నారని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఎమ్మెల్యే వెంటనే స్పందించి, రూ.10 లక్షల గ్రాంట్ విడుదల చేశారన్నారు.