ఉత్తమ అధికారిగా డీఆర్డీఏ పీడీ సుధారాణి
మన్యం జిల్లా డీఆర్డీఏ పీడీగా పని చేస్తున్న ఏం.సుధారాణి జిల్లా ఉత్తమ అధికారిగా అవార్డు అందుకున్నారు. పార్వతీపురం జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలలో కలెక్టర్ ప్రభాకర రెడ్డి చేతులు మీదగా ప్రశంసాపత్రంతో పాటు మెమెంటో అందుకున్నారు. అవార్డు గ్రహీతకు జిల్లా డీపీఎంలు, ఏపీఎంలు, సీసీలు అభినందనలు తెలిపారు.