రోడ్డు భద్రత వారోత్సవాల ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్

రోడ్డు భద్రత వారోత్సవాల ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్

WGL: వరంగల్ నగరంలో రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో పోచమ్మ మైదానం కూడలి నుంచి వరంగల్ చౌరస్తా వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఇవాళ జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీలో మహానగర మున్సిపల్ కమిషనర్, రవాణా శాఖ, పోలీస్ అధికారులు పాల్గొని రోడ్డు భద్రతా నియమాల పాటింపు ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు.