VIDEO: శ్రీకాకుళంలో అపారిశుధ్యం

శ్రీకాకుళం మండలం కొత్త రోడ్డు జంక్షన్ వద్ద రోడ్డు పక్కనే చెత్తాచెదారం పోగులుగా తయారైందని స్థానికులు ఆదివారం తెలిపారు. దీంతో దుర్వాసన వస్తుందని వారు వాపోతున్నారు. అదేవిధంగా రాత్రి సమయంలో దోమలు బెడద ఎక్కువగా ఉంటుందని స్థానికులు తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే చెత్తాచెదారాన్ని తొలగించే ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.