పుంగనూరు లో 29న ' ప్రజా వేదిక '
CTR: పుంగనూరు మున్సిపల్ కార్యాలయంలో ఈనెల 29న MLA పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ' ప్రజా వేదిక ' నిర్వహించనున్నట్లు మున్సిపల్ ఛైర్మన్ అలీమ్ భాష శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 2 గంటలు వరకు కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి పరిసర ప్రాంతాల ప్రజలు హాజరై ఎమ్మెల్యేకు వినతులు సమర్పించుకోవచ్చని చెప్పారు.