VIDEO: కడెం ప్రాజెక్టు 2 గేట్ల ద్వారా నీటి విడుదల

NRML: కడెం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా శుక్రవారం ఉదయం 5 గంటలకు 692.675 అడుగుల వద్ద కొనసాగుతున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లోగా 9280 క్యూసెక్కుల నీరు వస్తున్న క్రమంలో 2 గేట్ల ద్వారా 8412 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు అధికారులు తెలిపారు.