VIDEO: సిలిండర్ల రాక కోసం స్థానికుల ఎదురుచూపులు.!
కడప నగరంలో గ్యాస్ సిలిండర్లు సకాలంలో డెలివరీ జరగట్లేదని, OTP వచ్చినా సిలిండర్ ఇవ్వలేదని వినియోగదారులు అంటున్నారు. మంగళవారం బస్టాండ్ ఎదురు వీధిలో ఉన్న ఓ ఏజెన్సీ వద్ద గ్యాస్ వినియోగదారులు పెద్ద ఎత్తున గుమికూడారు. గ్యాస్ సిలిండర్ కోసం వస్తే కార్యాలయం తెరవలేదని అన్నారు. సిబ్బందికి ఫోన్ చేసిన స్పందించట్లేదని వాపోయారు.