కుమ్మరి గల్లి వాసుల ఆవేదన పట్టించుకోని అధికారులు

KMR: కుమ్మరి గల్లి వాసుల ఆవేదన పట్టించుకోని అధికారులు బిచ్కుంద మండల కేంద్రంలోని కుమ్మరి గల్లీలో గత రెండు నెలలుగా నీటి కొరతతో గల్లి వాసులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. చెత్త బండి రాకపోవడంతో చెత్త పెరిగిపోతోందని గల్లి వాసులు వాపోతున్నారు. ఈ విషయాలపై మున్సిపల్ కమిషనర్‌కు ఎన్నిసార్లు చెప్పిన స్పందన లేకపోవడంతో మండిపోతున్నారు.