'స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ చేసే ఉద్దేశం లేదు'
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం చేసే ఉద్దేశం లేదని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస్‌వర్మ అన్నారు. నష్టాల్లో ఉన్న కంపెనీలను కేంద్ర ప్రభుత్వం నడపదని.. అయితే విశాఖ స్టీల్‌ప్లాంట్ విషయంలో ప్రజల సెంటిమెంట్‌ను కేంద్రం గౌరవిస్తుందని తెలిపారు. అందుకుగాను రూ.11,400 కోట్ల ప్యాకేజీ ఇచ్చిందన్నారు. కొందరు కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అని పేర్కొన్నారు.