యుద్ధంపై మరోసారి ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌లో అన్ని ప్రాంతాలపై దాడులు చేశామని తెలిపారు. రాడార్స్, లాంచర్స్ నాశనం చేయడంతో ఇరాన్ పూర్తిగా క్షీణించిందని పేర్కొన్నారు. ఇరాన్ ఇంకా చేయడానికి ఏం లేదని, తమ మిలిటరీ లాగా ఏ దేశ మిలిటరీ ఉండదన్నారు. ఈ యుద్ధం ముగింపుతో చమురు ధరలు తగ్గుతాయన్నారు.