ఇండియా పోస్ట్ పేరుతో గిఫ్ట్స్ మెసేజ్ వచ్చిందా?

ఇండియా పోస్ట్ పేరుతో గిఫ్ట్స్ మెసేజ్ వచ్చిందా?

‘ఇండియా పోస్ట్‌-డాక్‌ సేవ గిఫ్ట్స్‌’ పేరుతో SMలో వైరల్ అవుతున్న మెసేజ్‌పై PIB ఫ్యాక్ట్‌ చెక్ హెచ్చరించింది. బహుమతులు, రివార్డులు వస్తాయంటూ వచ్చే లింకులను క్లిక్ చేయొద్దని సూచించింది. వీటికి తపాలా శాఖకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. మీ ఆధార్, OTP, బ్యాంక్ వివరాలను దొంగిలించేందుకు సైబర్ నేరగాళ్లు వేస్తున్న పన్నాగామని తెలిపింది.