డీఎంకే ఎంపీకి తప్పిన ఘోర ప్రమాదం

డీఎంకే ఎంపీకి తప్పిన ఘోర ప్రమాదం

డీఎంకే ఎంపీ ఏ రాజాకు ఘోర ప్రమాదం తప్పింది. ఓ పబ్లిక్ మీటింగ్‌లో రాజా మాట్లాడుతుండగా ఒక్కసారిగా లైట్ స్టాండ్ కూలింది. నిన్న సాయంత్రం మైలాడుతురై ప్రాంతంలో ప్రజా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ రాజా మాట్లాడారు. ఆయన మాట్లాడుతుండగా గాలి దుమారం రావడంతో అక్కడ ఏర్పాటు చేసిన లైట్ కూలిపోయింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.