పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

E.G: కడియం మండలం ఎంఆర్ పాలెం చైతన్యనగర్‌లో రూ.87 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదివారం ప్రారంభించారు. జలజీవన్ మిషన్ కింద రూ.51 లక్షలతో నిర్మించిన వాటర్ ట్యాంక్‌తో పాటు జడ్పీ హైస్కూల్ అదనపు తరగతి గదులు, అంగన్వాడీ భవనాన్ని జాతికి అంకితం చేశారు. ప్రజల వద్దకే అభివృద్ధి తీసుకెళ్తామని, మౌలిక వసతుల్లో రాజీ లేదని తెలిపారు.