అత్యాచారం.. పూజారికి 178 ఏళ్ల జైలు శిక్ష
తమిళనాడులోని శివగంగై కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ముగ్గురు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడిన 70 ఏళ్ల ఆలయ పూజారి పెరియసామికి ఏకంగా 178 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2024లో జరిగిన ఈ ఘటనపై పోక్సో చట్టం కింద విచారణ జరిపి.. నిందితుడికి వివిధ సెక్షన్ల కింద ఈ కఠిన శిక్షను ఖరారు చేసింది. అలాగే బాధితులకు తలా రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.