'ఇంటి పన్ను చెల్లించండి అభివృద్ధికి సహకరించండి'

'ఇంటి పన్ను చెల్లించండి అభివృద్ధికి సహకరించండి'

ELR: ఇంటి పన్ను చెల్లించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని ఉంగుటూరు డిప్యూటీ ఎంపీడీవో జీ. రమేష్ బాబు కోరారు. బుధవారం ఉంగుటూరులో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఇంటి పన్ను, కుళాయి పన్ను వసూళ్లను డిప్యూటీ ఎంపీడీవో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారి బొడ్డు. వెంకట రవిచంద్ర కుమార్, రామోజీరావు, పంచాయతీ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.