కలశ పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే
అనకాపల్లి పట్టణం గవరపాలెం నూకాంబిక అమ్మవారి ఆలయంలో శనివారం జరిగిన కలశ పూజలో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని విశేష పూజలు పంచామృతాభిషేకం అర్చనలు నిర్వహించారు. ఈనెల 8వ తేదీన దేవాలయాన్ని పునఃప్రారంభిస్తున్న సందర్భంగా కలశ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆలయ ఛైర్మన్ నాగ శ్రీను, ఈవో శ్రీధర్ తెలిపారు.