లిక్విడ్ గంజాయితో ముగ్గురు అరెస్ట్
GNTR: పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో లిక్విడ్ గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు ఒక కిలో లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ పర్యవేక్షణలో సీఐ వెంకట ప్రసాద్ నేతృత్వంలో పోలీసులు దాడులు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేశారు.